– బిజెపిలోకి ఆహ్వానించిన దుబ్బాక ఎమ్మెల్యే
దుబ్బాక: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట 8 వ వార్డుకు చెందిన గడ్డం జ్యోతి రాజు బిఆర్ఎస్ పార్టీ నుండి సొంతగూటికి చేరారు. బిజెపిలో చాలా సంవత్సరాలుగా పనిచేసిన జ్యోతి రాజ్ కొన్ని రోజుల క్రితం బిఆర్ఎస్ లో చేరారు. బిఆర్ఎస్ నాయకులు చెప్పిన మాయమాటలకు మోసపోయానని దుబ్బాక అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని శనివారం దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు గారి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు.




