సిద్దిపేట జిల్లా గజ్వేల్:అక్టోబర్ 7
24/7 తెలుగు న్యూస్
గజ్వేల్ పట్టణంలో నగలు శుభ్రం చేస్తానని ఇంటింటికి తిరిగి మోసం చేస్తున్న వ్యక్తిని ప్రజలు పట్టుకొని శనివారం దేహశుద్ది చేశారు. పట్టణంలోని ఎస్సీ కాలనీలో కెమికల్ తో కడిగిన నగలు ఉండాల్సిన అంత ఉండకపోవడంతో అనుమానం వచ్చి తూకం వేయించగా తరుగు రావడంతో నిందితున్ని పట్టుకుని చితకబాదారు ఈ క్రమంలో డబ్బులు ఇస్తాను అని సదరు నిందితుడు ఒప్పుకోగ, పట్టణ ప్రజలు గజ్వేల్ పోలీసులకు అప్పగించారు.
