ప్రాంతీయం

గనులు మూసి వేయబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

19 Views

గనులు మూసి వేయబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి

మంచిర్యాల జిల్లా,జనవరి 28, 2026:
బొగ్గు గనులు మూసి వేయబడిన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బొగ్గు గనులు సంబంధిత జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అన్ని బొగ్గు కంపెనీల జనరల్ మేనేజర్లతో మైన్స్ క్లోజింగ్ యాక్టివిటీలపై తీసుకోవలసిన చర్యల గురించి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ గనులు మూసివేసిన తర్వాత సంబంధిత ప్రాంతాలను స్థిరీకరించి సామాజిక అభివృద్ధి చర్యలు చేపట్టాలని తెలిపారు. మైన్స్ క్లోజింగ్ యాక్టివిటీ లలో భాగంగా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయడం, క్రీడా ప్రాంగణాలు నిర్మించడం, పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయడం వంటి చర్యలు తీసుకోవాలని, గనుల మూసివేతకు ముందు, తరువాతకు ఆయా ప్రాంతాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయాలని, మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని సూచించారు. మైనింగ్ చేయడం ద్వారా సంబంధిత ప్రాంతాలలో ప్రకృతి దెబ్బతింటుంది అనే భావనను ప్రజలలో తొలగించాలని, మైనింగ్ ప్రభావిత ప్రాంతాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలిపారు.

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ జిల్లాలో మూసి వేయబడిన గనుల ప్రాంతంలో హాస్పటల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, ఇండస్ట్రియల్ పార్క్ వంటివి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మూసివేయబడిన గనుల పరిసర ప్రాంతాల్లో సామాజిక అభివృద్ధి కొరకు 115 కోట్ల రూపాయలు జిల్లాకు కేటాయించడం జరిగిందని, ఈ నిధులు గనులు మూసి వేయబడిన ప్రాంతాలలో వినియోగించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు అయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) పి.చంద్రయ్య, గనులు భూగర్భ శాఖ ఎ.డి. జగన్ మోహన్, సింగరేణి సంస్థ శ్రీరాంపూర్ ఏరియా ఇన్చార్జి జి.ఎం. సిహెచ్. వెంకటేశ్వర్లు, ఎస్టేట్స్ మేనేజర్లు వరలక్ష్మి, సింగరేణి పర్యావరణ విభాగం అడిషనల్ మేనేజర్ హనుమాన్ గౌడ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌరసంబంధాల అధికారిచే జారీ చేయనైనది*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *