Breaking News

ఉత్తర్వులు జారీ

156 Views

రెవెన్యూ డివిజన్‌గా ఏటూరు నాగారం: ఉత్తర్వులు జారీ

ములుగు జిల్లా:అక్టోబర్ 07

ఏటూరు నాగారాన్ని డివిజన్‌గా కేంద్రం ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

కన్నాయిగూడెం, ఏటూరు నాగారం, మంగపేట, వెంకటాపురం, వాజేడు, తాడ్వాయి మండలాలతో రెవెన్యూ డివిజన్‌గా ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

మొన్నటి వరకు ములుగు రెవెన్యూ డివిజన్‌లో ఏటూరు నాగారం మండలం కొనసాగగా.. స్థానిక ప్రజల ఆకాంక్ష మేరకు సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది.

ములుగు డివిజన్‌లో గోవిందరావుపేట, వెంకటాపూర్‌, ములుగు మండలాలతో పాటు నూతనంగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలం ఉండనున్నది.

ఇదిలా ఉండగా.. ములుగు మండలంలో అంతర్భాగంగా ఉన్న మల్లంపల్లి గ్రామాన్ని.. మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తూ ప్రైమరీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక మండలంగా నోటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనున్నది

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *