ఎల్లారెడ్డి పేట మండలం
బొప్పాపూర్ గ్రామ శివారు లోగల ఎల్లమ్మ దేవాలయం వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా గంజాయి అమ్ముతున్నాడని నమ్మదగిన సమాచారం రాగా ఎస్సై తన సిబ్బందితో అక్కడికి వెళ్లి అక్కడ గంజాయి అమ్ముతున్న వ్యక్తి ని చాకచక్యంగా పట్టుకొని అతని వద్దనుండి 130 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకొన్నమాని ఎస్సై కే రమాకాంత్ తెలిపారు. అట్టి వ్యక్తిని విచారించగా మహమ్మద్ సమీర్(19) సంవత్సరాలు, ముస్లిం, తిమ్మాపూర్ కు చెందిన అతను హైదరాబాద్ లో చదువు కొనుచుండగా గంజాయి సేవించడం అలవాటైందని, అలాగే హైదరాబాదులో గుర్తుతెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి, దాని లో కొంత భాగం అతడు వాడుకుంటున్నారని ఎస్సై పేర్కొన్నారు. గంజాయిని బొప్పాపూర్ గ్రామ శివారులో వద్ద అమ్మడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. ఎల్లారెడ్డిపేట తహసిల్దార్ కు తెలుపగా సాక్షుల సమక్షంలో పంచనామా చేసి అట్టి గంజాయిని సీజ్ చేసి, గంజాయి అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట సర్కిల్ సిఐ కి అప్పగించగా, సిఐ తగిన విచారణ జరిపి అట్టి గంజాయి అమ్ముతున్న వ్యక్తిని కోర్టుకు తరలించమన్నారు. జడిషల్ రిమాండ్ విధించి, కరీంనగర్ జైలు కు పంపించడం జరిగిందని సిఐ గారు తెలియజేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో ఎవరైనా గంజాయి వాడిన, అమ్మిన అట్టి వ్యక్తుల పైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకొని తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.





