సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం 24/7 తెలుగు న్యూస్ర్ జగదేవపూర్ మండల పరిధిలోని దౌలాపూర్ గ్రామంలో సర్పంచ్ యాదలక్ష్మి శ్రీనివాస్ రెడ్డి, గజ్వెల్ ఏఎంసీ వైస్ చైర్మన్ రాచమల్ల ఉపేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో ముదిరాజ్ భవనానికి15 లక్షలు మంజూరు అయినందుకు సీఎం కెసిఆర్, మంత్రి హరీష్ రావుకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్ బడుగు బలహీన వర్గాల,సబ్బండ వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంటింటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని అన్నారు. ముదిరాజులకు చేపల పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కృషి చేస్తున్నారని అన్నారు. అదేవిధంగా మత్స్యకారులు గుర్తింపు కార్డులు అందించి వారికీ స్థానం కలిపించారని అన్నారు.సీఎం కెసిఆర్ నిరుపేదలకు అండగా పెద్దకొడుకులాగ, పెద్దన్న గా అందరికి సంక్షేమ ఫలాలు అందేవిధంగా కృషి చేస్తున్నారని అన్నారు.మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, యఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమం లో మాజీ ఎంపీటీసీ కొన్నే జయమ్మ,బీ ఆర్ యస్ గ్రామ అధ్యక్షులు జూపల్లి మధు,మాజీ ఉప సర్పంచ్ కదుర్ల రాజు, రాగుల యాదయ్య,బోయిని పుల్లయ్య,అనేమైన సత్యనారాయణ,నాగపూరి నాగులు, రాగుల చoద్రయ్య,యాట మల్లయ్య,పోకల రమేష్,మ్యాడమైన సిద్దులు, అనేమైన రామమ్మ,కాదుర్ల యాదగిరి,బరిగే వీరాస్వామి, కాదుర్ల నర్సీంలు తదితరులు పాల్గొన్నారు.
