దౌల్తాబాద్: మాదిగలపై కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపించడం తగదని ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు జంగపల్లి సాయిలు అన్నారు. గురువారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జనాభాలో అధిక శాతం ఉన్న మాదిగలను ప్రభుత్వం గుర్తించలేదని పార్లమెంటు స్థానాల్లో సరైన ప్రాధాన్యత కల్పించకపోవడం తగదన్నారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాదిగ నేతలు ఎదగకుండా అణగదొక్కారని విమర్శించారు. తెలంగాణలో మూడు ఎస్సి స్థానాలు ఉండగా అందులో ఒకటి కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు కేటాయించలేదని విమర్శించారు. మాదిగలు అవసరంలేని కాంగ్రెస్ సర్కార్ కు మాదిగ ఓట్లు ఎలా అవసరమో చెప్పాలని డిమాండ్ చేశారు. మాదిగలకు సముచిత స్థానం కల్పించని కాంగ్రెస్ కు ఎంపీ ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పాలన్నారు….
