మహిళలకుబతుకమ్మ చీరల పంపిణీ.
బతుకమ్మ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన బతుకమ్మ చీరలను ఎల్లారెడ్డి పేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ వెంకట్ రెడ్డి, జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, ఎంపీటీసీలు నాగరాణి,అనసూయ లు మహిళలకు పంపిణీ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న జడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రం వచ్చాక సి ఎం కేసీఅర్ ప్రజలకు ఎన్నో పథకాలతో లబ్ధి కలిగిస్తున్నారని , అలాగేబతుకమ్మ పండుగను మహిళలు ఆనందంగా జరుపుకొని సంభర పడేలా ప్రతి ఎటా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. రాష్ట్రంలోనిఅన్ని మతాల వారికి వారి,వారి పండుగల సందర్భంగా దుస్తులు పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకుంటున్నారు అని కొనియాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బి అర్ ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి సీ ఎం కేసీఆర్ మళ్లి గెలిపించుకోనీ ప్రభుత్వ పథకాలతో లబ్ధి పొందాలని కోరారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ధ్యాగం నారాయణ, నేలకంటి దేవేందర్, జవాజి లింగం, ఎనగందుల అంజలి బాబు, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, మండల మహిళా అధ్యక్షురాలు అప్సర్ ఉన్నిసా అజ్జు, సీనియర్ నాయకులు మీసం రాజం, మేగి నరసయ్య, బాధ రమేష్, గంట వెంకటేష్, ఏఎంసి డైరెక్టర్ మెండే శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
