జగదేవపూర్ మండల్ వెంకటాపూర్ పి టి గ్రామపంచాయతీలో జడ్పీ నిధులతో నిర్మించిన సిసి డ్రైన్ మరియు సోలార్ లైట్ ను జడ్పీటీసీ వంటెరు సుధాకర్ రెడ్డి గారు మరియు PACS చైర్మన్ ఆలేటి ఇంద్రసేనా రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించారు. మరియు నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించారు మరియు బతుకమ్మ చీరల పంపిణీ చేశారు కార్యక్రమంలో సర్పంచ్ పెర్కా కల్పన స్వామి, ఉప సర్పంచ్ తాండు వెంకట్ గౌడ్, వార్డ్ మెంబర్లు, ఎంపిటిసి, కో ఆప్షన్ మెంబెర్స్, కొండ పోచమ్మ మాజీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి గారు, రాయవరం మాజీ ఉప సర్పంచ్ మహేందర్ రెడ్డి గారు, మరియు మహిళా సంఘాలు, గ్రామ పెద్దలు యువత మరియు ప్రజలు అందరూ పాల్గొన్నారు.




