ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్ 5, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 33 జిల్లాలు ఏర్పడ్డాక మండలాలు పెరిగాయి గ్రామపంచాయతీలు పెరిగాయి. దీనికి అనుగుణంగా నూతన గ్రామపంచాయతీ భవనాలను ఏర్పాటు చేసింది. అందులో భాగంగానే గూడూరు గ్రామంలో మంత్రి కేటీఆర్ చొరవ చేసుకొని అన్ని గ్రామాలు బాగుండాలని తాపత్రయంతో భూమి పూజ చేశారు. గ్రామపంచాయతీ భవనం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నత్త నడకన నడుస్తుండగా అధికారుల నిర్లక్ష్యం ఎందుకని సర్పంచ్ సాకల రమేష్ సర్వసభ్య సమావేశంలో అధికారులను ఉద్దేశించి నిలదీశారు. అదే సమావేశంలో ప్రజా ప్రతినిధులు కలుగజేసుకొని చరవాణితో మాట్లాడుతూ అధికారులను ఒత్తిడి చేయగా అప్పటికప్పుడు తక్కువ టైంలో భవనాన్ని పూర్తి చేసి సహకరించి ప్రారంభోత్సవానికి అందించారు. జిపి భవనానికి సంబంధించి సభు కాంట్రాక్ట్ యజమాని రాత్రి పగలనకుండా త్వరితగతిన పూర్తి చేసినందుకు రవీందర్ రావును గ్రామ సర్పంచ్ అభినందించి శాల్వాతో సన్మానించారు. ఈకార్యక్రమంలో (మాజీఉపసర్పంచ్) వార్డ్ మెంబర్ శ్రీనివాస్ తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
