Breaking News

సోలిపేట సుజాత ఓటమికి కారణం కొత్త ప్రభాకర్ రెడ్డి నే.

103 Views
  • సోలిపేట సుజాత ఓటమికి కారణం కొత్త ప్రభాకర్ రెడ్డి నే.

*దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.

గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల్లో సోలిపేట సుజాత ఓటమికి కారణం మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డే నని కాంగ్రెస్ పార్టీ దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. గురువారం మండల కేంద్రం రాయపోల్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం ర్యాలీగా వెళ్లి చాకలి ఐలమ్మ,మహాత్మా గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి దుబ్బాకలో ఎమ్మెల్యే కు పోటీ ఉండకూడదనే ఉద్దేశంతో గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో సోలిపేట రామలింగారెడ్డి కుటుంబాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన వర్గీయులు సోలిపేట సుజాత ఓటమికి కారణమన్నారు. 2020 లో ఉద్యమ కుటుంబం అని సోలిపేట రామలింగారెడ్డి కుటుంబానికి టికెట్ ఇచ్చారని, ఇప్పుడు ఎందుకు ఆ ఉద్యమ కుటుంబానికి టికెట్ ఇవ్వలేదో తెలంగాణ ఉద్యమ నాయకులకు బిఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి 4 సంవత్సరాల 8 నెలలు గడుస్తున్న నేటికీ నిరుద్యోగులకు ఒక్క రూపాయి కూడా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. నిరుద్యోగ యువకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులను ఎక్కడికక్కడ నిలదీసి అడ్డుకోవాలన్నారు. బిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు.బూటకపు హామీలతో మళ్ళీ మేనిఫెస్టో తయారుచేసి మూడవసారి ప్రజలను మోసం చేయడానికి బిఆర్ఎస్ పార్టీ నాయకులు సిద్ధమయ్యారన్నారు. ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బూటకపు హామీలు ఇచ్చి ప్రజలను నట్టేట ముంచిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాస్ రెడ్డి బాధితున్ని పరామర్శించి రూ.5000 వేలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తప్పేట సుధాకర్, ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డీ, మండల ప్రధాన కార్యదర్శి మల్లేశo, మండల అధికార ప్రతినిధి కృష్ణాగౌడ్,సీనియర్ నాయకులు కిష్టారెడ్డి,భూపతిరావు,రాజిరెడ్డి,యూత్ నాయకులు దయాకర్,దుర్గాప్రసాద్,సత్తయ్య, కర్నాకర్ ,భాస్కర్ గౌడ్, రాజేందర్ రెడ్డి,యాదవరెడ్డి,స్వామి,లక్ష్మారెడ్డి,వెంకట్ రెడ్డి,తిరుపతి రెడ్డి,లాలు, పడాల రాములు,యాదగిరి,మల్లేశం, శ్రీనివాస్,కిరణ్,జానీ, కృష్ణ,నర్సింలు,బాబు, ఇస్మాయిల్,ఐదర్ తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *