Breaking News

స్వచ్ఛ సిద్దిపేట కాదు చెత్త సిద్దిపేటలా మారింది

78 Views

స్వచ్ఛ సిద్దిపేట కాదు చెత్త సిద్దిపేటలా మారింది

# అందుకే వార్డుల్లో చెత్తను ఏరుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు

# యూజుడి పనులు ముగిసిన వార్డులో రోడ్లు వేయని మున్సిపల్ అధికారులు పాలకవర్గం

# వార్డులు కాదు సిద్దిపేట బైపాస్ రోడ్డులో చెత్తతో అధ్వానంగా ప్రాంతాలు మారాయి

# సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్

సిద్ధిపేట;

సిద్దిపేట పట్టణం స్వచ్ఛ సిద్దిపేట కాకుండా చెత్త సిద్దిపేటలా మారిందని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్ ఆరోపించారు. సిద్దిపేటలో సోమవారం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ సిద్దిపేటలో అవార్డులు వచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న సిద్దిపేట మున్సిపల్ మరి వార్డుల్లో చెత్త ఎందుకు ఉంటుందని అన్నారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో ప్రతిరోజు చెత్త వాహనాలు వస్తున్నాయని మరి చెత్త అందించడం లేదా లేక వార్డు ప్రజలకు మున్సిపల్ అధికారులు పాలకవర్గం అవగాహన కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారా అని అన్నారు. సిద్దిపేట పట్టణంతో కాక పట్టణంలోని నలుమూలల బైపాస్ రోడ్డు మార్గాన ఇష్టానురీతిలో చెత్తకుప్పలు ఉన్నాయని వాటిని నియంత్రించడంలో కూడా విఫలమయ్యారని అన్నారు. యు జి డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పూర్తి చేసుకున్నా ఇంతవరకు పలు వార్డులలో సిసి రోడ్లు దిక్కే లేవని అన్నారు. సిద్దిపేట పట్టణం పేరుకు మాత్రమే స్వచ్ఛంగా ఉందని అధికార పార్టీ నాయకులు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారని వాస్తవానికి చిన్నపాటి వర్షానికి పలు చౌరస్తాలలో మోకాళ్ళ కింది వరకు నిలిచిపోతుందని అన్నారు. స్వచ్ఛ సిద్దిపేట కావాలంటే ముందుగా వార్డులు తర్వాత పట్టణం అంతా శుభ్రంగా శుభ్రంగా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. వర్షాకాలం సందర్భంగా అంటూ వ్యాధులు పొంచి ఉంటాయని అవి ప్రజల వద్దకు రాకుండా వార్డులో తగిన జాగ్రత్తలు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ యువజన అధ్యక్షులు గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *