రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పసుల కృష్ణ కు గురువారం నియామక పత్రాన్ని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దొమ్మాటి నరసయ్య అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ పంపిన నియామక పత్రాన్ని అందజేశామన్నారు. అల్మాస్పూర్ గ్రామానికి చెందిన పసుల కృష్ణ ప్రస్తుతం అడ్వకేట్ గా పనిచేస్తున్నారు.
