ఘనంగా పోలీస్ అమరవీరుల దినోత్సవం (ఫ్లాగ్ డే)
పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయం: జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్
21 అక్టోబర్ కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా
పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం
( ఫ్లాగ్ డే) ను పురస్కరించుకొని శనివారం రోజు పోలీస్ హెడ్ క్వార్టర్స్ , ఆసిఫాబాద్ నందు ఘనంగా పోలీస్ అమరవీరులకు నివాళులర్పించారు . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే హాజరయ్యారు. ముందుగా ప్రజ్వలన జ్యోతి వెలిగించి, పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భం గా ఎస్పీ ఈ
సందర్బంగా మాట్లాడుతూ… పోలీస్ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. సిర్పూర్ కాగజ్ నగర్,ఆసిఫాబాద్ ప్రాంతం లో 1995 నుండి 14 మంది పోలీసులు వాళ్ళ ప్రాణాలు సమాజం కోసం శాంతి భద్రతల కోసం త్యాగం చేసినారనీ, వారందరి సేవలు మరొక్కసారి మనం స్మరించుకొని , త్యాగాలను , గుర్తుకు చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నారు.
సమాజం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ఉంటుందంటే దానికి కారణం పోలీసువారేనని పేర్కోన్నారు.
పండగలకు , సెలవులకు అతీతంగా, సరదా సంబురాలకు దూరంగా ఉంటూ, సమాజ శ్రేయస్సు కోసం పరితపించేది పోలీస్ శాఖ అని పేర్కొన్నారు.
విధి నిర్వహణలో , ప్రాణాలు కూడా త్యాగం చేయడం వల్ల ఈ రోజున సమాజంలోని అన్ని వర్గాల వారు సుఖశాంతులతో ఉంటున్నారని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకొని ఫ్రెండ్లీ పోలీసు వ్యవస్థ కొనసాగుతుంది అని పేర్కొన్నారు.
ప్రజలు తమకు వచ్చిన కష్టాలు చెప్పుకోవడానికి పోలీస్ స్టేషన్ కు రావడానికి భయపడకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి పోలీసులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. మనం ఎండనకా , వాననక కష్టపడుతున్న మనం ప్రజలందరికీ కూడా ఇంకా ఎక్కువ సేవ చేసి మన రాష్ట్ర ప్రభుత్వానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి మన పోలీస్ శాఖ కు మంచి పేరు తేవాలని కోరారు .
అనంతరం అమరవీరుల కుటుంబసభ్యుల సమస్యలను తెలుసుకొని వాటిని త్వరగా పరిష్కరించే దిశగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబ సభ్యులను శాలువాతో సన్మానించి, బహుమతులు అందించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ అడ్మిన్ అచ్చేశ్వర రావు, డీఎస్పీలు వెంకటరమణ, కరుణాకర్ , రమేష్, జిల్లాలోని పోలీస్ అధికారులైన సి.ఐ లు, ఆర్.ఐ లు, ఎస్.ఐ లు, ఆర్.ఎస్.ఐ లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





