సుల్తానాబాద్: అక్టోబర్3
24/7 తెలుగు న్యూస్
సుల్తానాబాద్ నియోజకవర్గంలో బి.ఆర్.ఎస్ పార్టీకి కంచు కోటలాంటి కార్యకర్తలు ఉన్నారని అందుకు నిదర్శనమే పెద్దపల్లి కేటీఆర్ సభ విజయవంతం అని బి.ఆర్.ఎస్ పార్టీ శ్రేణులు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని వైశ్య భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత రమేష్ గౌడ్ మండల పట్టణ పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు పారుపల్లి గుణపతి అనుబంధ సంఘాల నాయకులు పార్టీ శ్రేణులు మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సభ విజయవంతం కావడంతో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు కు మతి భ్రమించిందని రోజురోజుకు బిఆర్ఎస్ కు వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేక అర్థరహితపు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
