ముస్తాబాద్, ప్రతినిధి అక్టోబర్3,
పోతుగల్ గ్రామంలో వ్యవసాయ మార్కెట్ కమిటి అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ తోటి స్నేహితులు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిగిజినల్ ఆఫీసర్ పోచయ్య సహకారంతో తాటకర్ల మహేశ్, తాటకర్ల శంకర్ కు పిఓయస్ ఉపాధిని కల్పించారు. ఈసందర్భంగా మహేశ్, శంకర్ వీరి ఇరువురు తో పాటు అక్కరాజు శ్రీనివాస్, పోచయ్య కి కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తన్నీరు గౌతంరావు, ఉప సర్పంచ్ మంజుల రమేష్, భారతీయ మజ్దూర్ సంఘ్ జిల్లా కన్వీనర్ తోట ధర్మేందర్, ఈర్ల విద్యాదర్, కోల పర్శరాములు గౌడ్, రేపాక బాల్ నర్సు, అనిల్, దేవరాజు, వెంకట్రాజు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




