జాతిపిత మహాత్మా గాంధీజి జయంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ ,పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
అనంతరం ఎస్పీ మాట్లాడుతూ…సత్యం,అహింస సత్యాగ్రహం అనే మూడు ఆయుధాలతో బ్రిటిష్ వారిపై పోరాటం చేసి దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన గొప్ప యోధుడు గాంధీజీ అని,గాంధీజీ సూచించిన శాంతి, అహింస, సత్యం మార్గంలో ముందుకు సాగాలని గాంధీ సన్మార్గంలో ప్రయాణిస్తూ నమ్మిన సిద్ధాంతాలను విలువలను నిబద్ధతతో ఆచరించడం వల్ల ఆయన కీర్తి ప్రతిష్టలు విశ్వవ్యాప్తం అయ్యాయని అన్నారు.నేటి యువతరం గాంధీజీ జీవన మార్గాన్ని అనుసరించాలని సూచించారు. స్వాతంత్రం కోసం గాంధీజి చేసిన సేవలు మరువలేనివి అన్నారు. దేశ అభివృద్ధి కోసం నిస్వార్థంగా మనమందరం సేవలు అందించాలని కోరారు.గాంధీజీలాంటి గొప్ప నాయకున్నీ ఆదర్శంగా తీసుకుని మనము ప్రజలకు సేవ చేయాలని, కష్టపడే తత్వం అలవర్చుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రవికుమార్, టౌన్ సి.ఐ ఉపేందర్, ఆర్.ఐ యాదగిరి, రమేష్,ఎస్.ఐ లు సిబ్బంది పాల్గొన్నారు.




