కోనరావుపేట తహసిల్దార్ వరలక్ష్మి…
కోనరావుపేట ఏప్రిల్ 16(tslocal vibe): పౌష్టికాహారమే అందరికి ఆరోగ్యకరమని కొనరావుపేట మండల తహసిల్దార్ వరలక్ష్మి అన్నారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం ధర్మారం సెక్టర్ పరిధిలోని మర్తనపేట గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణపక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తహసిల్దార్ వరలక్ష్మి మాట్లాడుతూ గర్భిణీ బాలింతలు పిల్లలు అంగన్వాడీలో అందించే మంచి పోషకాహారం తీసుకొని ఆరోగ్యకరమైన జీవనం సాగించాలని, గర్భిణీలు నార్మల్ డెలివరీ అయ్యేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ధర్మారం సెక్టర్ సూపర్వైజర్ కనకమ్మ మాట్లాడుతూ అతి తీవ్ర లోప పోషణ ఉన్న పిల్లల్ని గుర్తించి వారి పోషణ స్థాయి పెంపొందించాలని, తక్కువ ధరలో ఎక్కువ పోషకాలు ఉన్న ఆహార పదార్థాల గురించి తల్లులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, వైస్ చైర్మన్ తాళ్లపల్లి ప్రభాకర్, డైరెక్టర్ అప్పల నాగభూషణం,ఎంపీడీవో శంకర్ రెడ్డి,ఏపిఎం రాకేష్, మాజీ సర్పంచులు గుమ్మడి కాంతయ్య, జవ్వాజి తిరుపతి గౌడ్, వెన్నమనేని వంశీకృష్ణ రావు, అంగన్వాడి టీచర్ సునీత, ఆశ వర్కర్లు గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు.
