మహాత్మాగాంధీ జీవన విధానం ప్రతి ఒక్కరికి ఆదర్శమని, వారి అడుగుజాడల్లో నవడమే మహహత్మునికి ఇచ్చే అసలైన నివాళి అని సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ అన్నారు.
సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ , జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిరిసిల్ల ఆర్డీఓ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, గాంధీ తన జీవితంలో జరిగిన అనుభవాలను తెలుపుతూ సత్య శోధన, సత్యంతో నా ప్రయోగాలు అనే ఆటోబయోగ్రఫీ పుస్తకాన్ని రచించారని, జీవితాంతం సత్యం, అహింస మార్గంలో గాంధీ గడిపారని అన్నారు.
మహాత్మా గాంధీ జీవితం నుంచి మనమంతా ప్రేరణ పొందాలని, వారి ఆశయాలను పాటించాలని అన్నారు. గాంధీజీ జీవనాన్ని పరిశీలిస్తే మనం ఎలా ఉండాలో, ఉండకూడదు తెలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.
