ప్రకటనలు

గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించిన ఆశా వర్కర్లు

96 Views

ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18000 /- రూపాయలు అమలు చేయాలని పిఎఫ్ , ఈఎస్ఐ సదుపాయాలు కల్పించాలని ప్రమాద బీమా సౌకర్యం రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందించాలని తదితర డిమాండ్లపై ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మె ఈరోజుకు 8 రోజులకు చేరుతుంది ఈరోజు అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా ఆశా వర్కర్లు సిరిసిల్ల అంబేద్కర్ కూడలిలో ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి తమ సమస్యలను పరిష్కరించాలని గాంధీజీ విగ్రహానికి వినతి పత్రాన్ని అందించారు.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కోడం రమణ గారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించే విధంగా వెంటనే చర్యలు తీసుకోవాలని లేకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని అన్నారు.

 

సోమవారం  సమ్మెకు కాంగ్రెస్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి , సంగీతం శ్రీనివాస్ , చొప్పదండి ప్రకాష్ , ఆకునూరి బాలరాజు , గోనె ఎల్లప్ప ల మద్దతు తెలిపి మాట్లాడడం జరిగింది.

ఈ కార్యక్రమంలో అశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బదవేణి మంజుల కార్యదర్శి జయశీల ,భారతి , కస్తూరి , గాయత్రి , రుచిత , లావణ్య , లత , చంద్రకళ , హెప్సి , దేవలక్ష్మి , మమత , లక్ష్మీ , వనిత , వరలక్ష్మి , నిర్మల పెద్ద ఎత్తున ఆశ వర్కర్లు పాల్గొన్నారు

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

రాచర్ల గొల్లపల్లి లో సర్పంచ్ గా గెలిచేది ఎవరు...?
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *