- ఘనంగా నాగుల ఎల్లమ్మ గుడి వార్షికోత్సవ వేడుకలు
-సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలి:విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి
ఎల్లారెడ్డిపేట మండలంలోని రాచర్ల గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున శ్రీ జమదగ్ని సమేత నాగుల ఎల్లమ్మ ఆలయ చతుర్ధ వార్షికోత్సవ వేడుకలను గౌడ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామి నాగుల ఎల్లమ్మ గుడిలో పూజలు గావించి గౌడ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించ తలపెట్టిన శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ నిర్మాణ స్థలాన్ని సందర్శించి భూమి పూజ గావించిన చోట తన అమృత హస్తాలతో టెంకాయ కొట్టారు.అనంతరం భక్తులను ఉద్దేశించి ఉపన్యసిస్తూ సాంప్రదాయాలను కాపాడుతూ ఆచరించాలని సూచించారు.ఈ కార్యక్రమం సందర్భంగా నాగుల ఎల్లమ్మ ఆలయ పూజారి తంగలపల్లి సంపత్ శర్మ, ఆద్వర్యంలో తంగలపల్లి శ్రీనివాస శర్మ, సంకేత శర్మ, శివశర్మ, అర్చకుల బృందం ఉదయం నుండి నాగుల ఎల్లమ్మ ఆలయంలో గణపతి పూజ, పంచామృతాభిషేకం, పుణ్యాహవాచనం,పంచగవ్య ప్రాసన, కంకణ దారణ, నవగ్రహ బ్రహ్మ కలశ స్థాపన, అమ్మవారి కళ్యాణము, మహిళ భక్తులచే సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు.తదుపరి అన్నప్రసాద ప్రసాద వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో గొల్లపల్లి గౌడ సంఘం కమిటీ సభ్యులు,నూతన ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు,సంఘ సభ్యులు భక్తులు,గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





