దౌల్తాబాద్: దౌల్తాబాద్ మండల నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిగా కౌకూరి స్వామిని జిల్లా అధ్యక్షుడు జనగామ సతీష్ ఆధ్వర్యంలో సోమవారం ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షుడిగా యాదగిరి, కోశాధికారిగా శేఖర్, ప్రధాన కార్యదర్శిగా నరేష్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు కరుణాకర్, ఆంజనేయులు, గణేష్, సత్యం, అంజయ్య, సిద్ధి రాములు, యాదగిరి, రమేష్, శ్రీనివాస్, నాగరాజు, కృష్ణ, మహేష్, శ్రీధర్, నాగరాజు, ఏగొండ స్వామి, చిన్న మల్లేశం, శంకరయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు…..
