గజ్వేల్ 04 అక్టోబర్ టాటా ప్రోడక్ట్ ధాన్య సీడ్స్ కంపెనీ వారి అతిష్ పత్తి పంట పై రైతు సల్లూరి రామచంద్రం పంట పొలంలో క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కంపెనీ టి ఎస్ ఎం జగదీష్ రెడ్డి హాజరై మాట్లాడుతూ టాటా ప్రోడక్ట్ ధాన్య సీడ్స్ వారి అతిష్ అనే పత్తి పంటతో అధిక దిగుబడులు రైతులు పొందవచ్చని అన్నారు. పత్తి తీయడానికి సులువుగా వస్తుందని, పంట త్వరగా ఎక్కువ కాయలు అధిక దిగుబడులు ఇస్తుందని, రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం రైతు రామచంద్రం శాలువాతో సన్మానించి కంపెనీ తరఫున బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏ జి ఎం రమేష్ బాబు,రీజినల్ మేనేజర్ సునీల్ రెడ్డి, ఆర్ ఎం డి ఎం మధుసూదన్ రెడ్డి,కంపెనీ ఎంప్లాయిస్ ఎం డి ఆర్ చీమల దారి కుమార్ గౌడ్ రైతులు, తదితరులు పాల్గొన్నారు.




