– టీపీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్. శ్రవణ్ కుమార్ రెడ్డి
– దుబ్బాకకు హీరో వెంకట్
– సెల్ఫీలతో కాసేపు సందడి
దుబ్బాక: దుబ్బాక పట్టణంలోని అల్లూరి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయక నిమజ్జన కార్యక్రమంలో హీరో వెంకట్ తో కలిసి కాంగ్రెస్ పార్టీ టిపిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్. పన్యాల శ్రవణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దైవ చింతన కలిగివుండాలని కోరారు. దుబ్బాకకు హీరో వెంకట్ రావడం సంతోషంగా ఉండాలన్నారు.హీరో వెంకట్ తో స్థానిక ప్రజలు అభిమానులు కాసేపు సెల్ఫీ ఫొటోలతో సందడి చేశారు.ఈ కార్యక్రమంలో బాల వెంకన్న, గున్నాల సాయి కృష్ణ గౌడ్, సంజీవ రెడ్డి, బాబు, మాంగోలి రాజు కుమార్, తదితరులు పాల్గొన్నారు.