ప్రకటనలు

3 న సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కేటిఆర్ పర్యటన

191 Views

ఈ నెల 3 వ తేదీన సిరిసిల్ల నియోజకవర్గంలో మంత్రి కే టి రామారావు పర్యటించనున్నారు.3 వ తేదీన మధ్యాహ్నం 03.00 గంటలకు జగుత్యాల జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుంటారు. ఆ వెంటనే ధర్మపురి నుండి హెలికాప్టర్ ద్వారా సిరిసిల్ల లోని నూతన ఎస్పి భవనం వెనుకాల నిర్మించిన హెలిప్యాడ్ వద్దకు మధ్యాహ్నం 03.30 గంటలకు చేరుకుంటారు.

సిరిసిల్ల నుండి 05.30 గంటలకు హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతారు. మొత్తం 2 గంటల పాటు సిరిసిల్ల లో నిర్వహించే కార్యక్రమాలలో మంత్రి పాల్గొంటారు. బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారు.

2020-21 ఆర్థిక సంవత్సరంకుగానూ జిల్లాలోని 561 మంది ఎస్సీ లబ్ధిదారులకు ఆర్థిక సహాయ పథకం కింద 14 కోట్ల 61 లక్షల 86 వేల ఆర్థిక సహాయాన్ని మంత్రి కే తారక రామారావు అందించనున్నారు.లాంఛనంగా కొద్ది మందికి ప్రొసీడింగ్స్, జంబో చెక్కు అందజేస్తారు.

మంత్రి పర్యటన ను సజావుగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఐడిఓసి లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రెవెన్యూ , పోలీస్, ఎస్సీ కార్పొరేషన్ అధికారులకు మార్గదర్శనం చేశారు.ఇప్పటికే సిద్దం చేసిన హెలిప్యాడ్ వద్ద తగిన భద్రత ఏర్పాట్లు చేయాలని చెప్పారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *