మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి జయంతి వేడుకలు నిర్వహించిన
– ఎంపీపీ కల్లూరి అనిత
రాయపోల్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా మహాత్మా గాంధీ జయంతి సోమవారం నిర్వహించారు, అనంతరం జయంతి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ చిత్రపటానికి ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జీవితం మనకు స్ఫూర్తిదాయకం అని అన్నారు. మనం కూడా ఎలాంటి పరిస్థితుల్లోనైనా హింస మార్గాన్ని వదిలి సత్యం అహింస మార్గంలో వెళ్లాలని సూచించారు. ఆనాటి బ్రిటిష్ పాలన ద్రోహులను ప్రాలతోలడనికి అనేక ఉద్యమాలు చేసి దేశం కోసం పోరాడిన స్వతంత్రాన్ని సాధించిన మహానుభావుడు మహాత్మా గాంధీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మౌనిక రాజిరెడ్డి , గ్రామపంచాయతీ కార్యదర్శి శివకుమార్ ,జిల్లా బిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు కల్లూరి శ్రీనివాస్ ,మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.