ప్రాంతీయం

ప్రజా అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం

117 Views

-సమగ్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రణాళిక.
– మంత్రి హరీష్ రావు కృషితో వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు.
– స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డా. వంటేరు యాదవ రెడ్డి.
– కాలువల్లో నీళ్లు పారుతున్న ఎండుతున్న పొలాలు.
– వడ్డేపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ ఆవేదన.

సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని ఇతర రాష్ట్రాల నుండి అధికారుల బృందాలు ప్రజా ప్రతినిధుల బృందాలు రాష్ట్రానికి వచ్చి అభివృద్ధి పథకాలను పరిశీలించి వారి రాష్ట్రాలలో అమలు పరచడం జరుగుతుందని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి అన్నారు. బుధవారం రాయపోల్ మండల కేంద్రంలో ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్ అధ్యక్షతన సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు నివేదిక రూపంలో గత మూడు నెలలుగా జరిగిన అభివృద్ధి పనులను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం వడ్డేపల్లి సర్పంచ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ కొండపోచమ్మ ప్రాజెక్టు నుండి రామాయంపేట కెనాల్ ద్వారా ఇటీవలనే జిల్లా మంత్రి హరీశ్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి నీటిని విడుదల చేశారని మన మండలంలోని మన గ్రామాలను కూడా మీరు వెళ్తున్నాగాని మన చెరువులు నిండక వరి పంటలు ఎండిపోయే దుస్థితి ఏర్పడిందన్నారు. వీరనగర్ బ్రిడ్జి కింద మట్టి తీసివేస్తే సుమారు 8 గ్రామాల చెరువులు కాలువలు అవసరం లేకుండానే నింపవచ్చన్నారు. దీని ద్వారా ఎండిపోయే వరి పంటలకు సాగునీరు అందించవచ్చున్నారు. కాల్వల కోసం భూములు కోల్పోయి నష్టపోయింది మన రైతులు అయితే, నీళ్లు రాకుండా నష్ట పోతుంది కూడా మన రైతులేన్నారు. ఎమ్మెల్సీ యాదవ రెడ్డి కలుగజేసుకొని సమస్యను వెంటనే అధికారులతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. కాలువలు అవసరం లేకుండానే నీరు అందించే అవకాశం ఉండి రైతుల పంటలు ఎండిపోవాల్సిన అవసరం లేదన్నారు. అలాగే ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామాలలో అభివృద్ధి పనులు చేపడుతున్న బిల్లులు రాక అప్పుల పాలు అవుతున్నామన్నారు. ఉపాధి హామీ పథకంలో అభివృద్ధి పనులు చేపడితే మార్చ్ 31 వరకే ఆర్థిక సంవత్సరం పూర్తి అవుతుంది.తమ సర్పంచ్ పదవి కాలం పూర్తియిన బిల్లులు రాని పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా చూడాలన్నారు. గతంలో గ్రామాలలోకి వయా బస్సులు వచ్చాయి. ఇప్పుడు రాకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు పడుతున్నారు. కావున ఆ బస్సులను పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులకు సూచించారు. ముంగిస్ పల్లి సర్పంచ్ స్వామి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనం దాదాపు పూర్తికావచ్చిందని మరికొన్ని నిధులు కేటాయిస్తే పూర్తి నిర్మాణం అవుతుందని, ఆ భవనానికి నిధులు కేటాయించే విధంగా కృషి చేయాలని పేర్కొన్నారు. అనంతరం ఎంపీపీ కల్లూరి అనిత శ్రీనివాస్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ ఒకప్పుడు గుజరాత్, కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలను అభివృద్ధికి ఆదర్శంగా తీసుకుని పథకాలు చేపట్టే పరిస్థితి ఉండేదని, నేడు తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి పథకాలను చూసి దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి అధికార బృందాలు వచ్చి ప్రశంసించడంతోపాటు వారి రాష్ట్రాలలో అమలుపరుస్తామని చెప్పడం కెసిఆర్ పరిపాలనకు నిదర్శనం అన్నారు. రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభోత్సవంలో ఢిల్లీ, పంజాబ్, కేరళ ముఖ్యమంత్రి సామాన్య ప్రజలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మా రాష్ట్రలలో కూడా అమలు చేస్తామని ప్రకటించడం గర్వకారణం అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో కేవలం వరంగల్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రిలో మాత్రమే డయాలసిస్ కేంద్రాలు ఉండేవని నేడు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు విశేష కృషితో 104 డయాలసిస్ కేంద్రాలు ఏర్పరచుకోవడం తెలంగాణ సాధించిన ప్రగతి అన్నారు. అనంతరం అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళ ప్రజాప్రతినిధులు, అధికారులకు ఘనంగా సన్మానం చేసి మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్పర్సన్ ఇప్ప లక్ష్మి, పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి, ఎంపీడీవో మున్నయ్య, కో ఆప్షన్ సభ్యులు పర్వేజ్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
Telugu News 24/7

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *