ప్రాంతీయం

యోగ డైట్ పై అవగాహన కార్యక్రమం

45 Views

మంచిర్యాల జిల్లా.

యోగ డైట్ పై అవగాహన కార్యక్రమం.

అంతర్జాతీయ యోగా దశాబ్ది
ఉత్సవాలలో భాగంగా … ఈరోజు యోగ డైట్ పౌష్టికాహారం కార్యక్రమాన్ని కాసిపేట మండలంలోని దేవపూర్ గ్రామపంచాయతీ ఆవరణంలో చేయడం జరిగింది. నిత్య జీవితంలో ఆరోగ్యంగా ,ఫిట్ గా ఉండాలంటే ఎలాంటి ఆహరం తీసుకోవాలి,యోగ డైట్ పాటించడం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి పిల్లలకు,గ్రామ ప్రజలకు,పంచాయతీ పెద్దలకు తెలియచేయడం జరిగింది. రోజు యోగ డైట్ తీసుకోవడం వల్ల శారీరక, మానసిక సమతుల్యత ఎలా కలుగుతుందో వివరించి వారందరికీ కూడా యోగ డైట్ పౌష్టికాహారం ను అందించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ పంచాయితీ సెక్రెటరీ కవిత,ఆయుష్ ఆరోగ్య మందిర్ ఫార్మసిస్ట్ రమాదేవి, యోగ ఇన్స్పెక్టర్స్ పి. నాగార్జున, జి గీత దేవి, మాజీ ఎంపీటీసీ పద్మ,మాజీ ఉప సర్పంచ్ రాజిరెడ్డి,కొమ్ములు బాపు,ఖదీర్ ,కాంగ్రెస్ కార్యకర్తలు,యోగ స్టూడెంట్స్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

Oplus_131072
Oplus_131072
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్