– బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బోనాల మోహన్
(తిమ్మాపూర్ అక్టోబర్ 02)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన గృహలక్ష్మి పథకానికి అనర్హులను ఎంపిక చేశారని, వారి పేర్లను వెంటనే తొలగించాలని తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ గ్రామంలో బిజెపి జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బోనాల మోహన్ డిమాండ్ చేశారు.అనంతరం గ్రామసభలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పేద ప్రజలకా, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకా అని ప్రశ్నించారు.గ్రామంలో మొదటి విడతగా ఎంపిక చేసిన గృహలక్ష్మి పథకంలో చాలామంది అనర్హులు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.నిరుపేదల సొంతింటి కల పక్కదారి పడుతుందని ఆరోపించారు.గృహలక్ష్మి పథకానికి ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో అర్థం కానీ పరిస్థితులు నెలకొన్నాయన్నారు.వెంటనే గ్రామంలో రి సర్వే చేయించి గృహలక్ష్మి పథకానికి అర్హులను గుర్తించాలని, సొంతింటి కలను సాకారం చేసుకునే నిరుపేదల సొంతింటి కల పక్కదారి పడుతుందని ఆరోపించారు.గృహలక్ష్మి పథకానికి ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తున్నారో అర్థం కానీ పరిస్థితులు నెలకొన్నాయన్నారు. వెంటనే గ్రామంలో సర్వే చేయించి గృహలక్ష్మి పథకానికి అర్హులను గుర్తించాలని, సొంతింటి కలను సాకారం చేసుకునే నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.




