వర్గల్ మండల్, మైలారం అక్టోబర్ 2 :మైలారం గ్రామంలో తాళం వేసిన కిరాణా షాప్ రేకులను పగులగొట్టి షాపులో కిరాణా సామానుతో పాటు దుండగులు గల్ల పెట్టలో దవాఖానకోసం దాచుకున్న 10 వేలు ఎత్తుకెళ్లినట్లు షాప్ యజమాని తెలియజేశాడు.
షాపు యజమాని అయిన కుకునూరు అంజాగౌడ్ ఇదే విషయమై గౌరారం పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించినట్లు తెలిపారు.