ప్రాంతీయం

పరామర్శ కు వచ్చిన వారిని అడ్డుకుంటా అనడం సిగ్గుచేటు

223 Views

ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో భారతీయ జనతా పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుడు..
దరువు ఎల్లన్న తల్లిగారు మరణిస్తే బాధలో ఉన్న ఆ కుటుంబాన్ని ఓదార్చడానికి వచ్చే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ని అడ్డుకుంటామని ప్రయత్నాలు చేసిన ఎల్లారెడ్డిపేట తెరాస నాయకులకు సిగ్గుందా అని ఘాటుగా విమర్శించారు,,, కనీసం మానవత్వం లేకుండా బండి సంజయ్ ని అడ్డుకుంటామని సుమారు 50 మంది జమకుడి, నైతిక విలువలు మరచి, సిగ్గుమాలిన పని చేసిన మీకు ప్రజలే గుణపాఠం చెబుతారు భాజపా నాయకులు మండి పడ్డారు.

బండి సంజయ్ ని అడ్డుకొనేంత దమ్ము మీకు ఉంటే బండలింగంపల్లి వచ్చి అడ్డుకుంటే అక్కడున్న కార్యకర్తలు మీకు గుణపాఠం చెప్పే వాళ్ళని హెచ్చరించారు..

కేటీఆర్ కు దమ్ముంటే ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయకుండా సిరిసిల్ల లో అడుగు పెట్టి చూడమని చెప్పండని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సిరిసిల్లలో అడుగుపెట్టే అర్హత కేటీఆర్ కు లేదని, ఎల్లారెడ్డిపేట లో డిగ్రీ కళాశాల, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి ఎక్కడ అని భాజపా నాయకులు ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయకుండా కేటీఆర్ వస్తే అడ్డుకోవడం అంటే ఏంటో చూపిస్తామని అన్నారు.‌ తెరాస నాయకులు నైతికత మరిచి గుండాలాగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు..

తెరాస నాయకులు కార్యకర్తలు మనుషులు అన్న విషయం మరచి పోతే ప్రజలే గుణపాఠం చెబుతారని విషయం గుర్తుపెట్టుకోండని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలోమండల ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు దాసరి గణేష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సిరిసిల్లా ప్రకాష్, ఎస్టీసెల్ యువ మోర్చా అధ్యక్షుడు కిరణ్ నాయక్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు మానుక రాజు యాదవ్, యువ మోర్చా జిల్లా కార్యదర్శి దూస శ్రీనివాస్, సురేష్ యాదవ్, నరేష్, సాయి తదితరులు పాల్గొన్నారు.

Oplus_131072
Oplus_131072
Telugu News 24/7