దౌల్తాబాద్: ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న పిఆర్సి వేతనాలు వెంటనే చెల్లించాలని ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి బాలమణి అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి తహసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా పెరుగుతున్న ధరలకు అనుకూలంగా ఫిక్స్డ్ వేతనం రూ. 18,000 అమలు చేయాలని అన్నారు. 32 రకాల రిజిస్టర్ లను ప్రభుత్వం సప్లై చేయాలని టీబీ, లెప్రసి, కంటి వెలుగు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్లకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు లక్ష్మి, కౌసల్య, రజిత, కనక లక్ష్మి, రేణుక, రాజేశ్వరి, స్వప్న, మాధవి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు….,
