మహాత్మా గాంధీ జయంతి సామాజిక కార్యకర్త తాండ బాలకృష్ణ గౌడ్
అక్టోబర్ 2
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో గాంధీ జయంతి పురస్కరించుకొని సామాజిక కార్యకర్త బాలకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం శ్రమదానంలో పాల్గొన్నారు
ఈ సందర్భంగా బాలకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని భారతదేశ స్వాతంత్ర సంగ్రామం లో మహాత్మా గాంధీ పోరాటం ఎనలేనిదని గుర్తు చేశారు గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని, భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముఖ్య భూమిక పోషించిన మహాత్మా గాంధీ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరం నడవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నగేష్, మహేష్ గౌడ్, లక్షిత్ గౌడ్, గిరి, స్వామి, అశోక్, కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు
