ఈ నెల 13న కౌంటింగ్ ప్రక్రియ కొరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధం,జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్.
మంచిర్యాల జిల్లా ,ఫిబ్రవరి 12, 2026:
2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 13వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొరకు పూర్తి ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో, బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని చెన్నూర్ పట్టణంలో గల అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్.కె.సి.ఓ.ఎ. క్లబ్ లో, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొరకు అదనపు సిబ్బందితో కలిపి 66 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 132 మంది కౌంటింగ్ సహాయకులు, బెల్లంపల్లి మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 19 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 37 మంది కౌంటింగ్ సహాయకులు, చెన్నూరు మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 10 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 20 మంది కౌంటింగ్ సహాయకులు,, క్యాతనపల్లి మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 24 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 48 మంది కౌంటింగ్ సహాయకులు, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి అదనపు సిబ్బందితో కలిపి 9 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 18 మంది కౌంటింగ్ సహాయకులను రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ బెల్లంపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 34 వార్డులకు గాను 17 టేబుల్స్ ఏర్పాటు చేసి 2 రౌండ్లలో పూర్తి చేయడం జరుగుతుందని, చెన్నూరు మున్సిపాలిటీకి సంబంధించి 18 వార్డులకు గాను 9 టేబుల్స్ ఏర్పాటు చేసి, 2 రౌండ్లలో పూర్తి చేయడం జరుగుతుందని, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి సంబంధించి 15 వార్డులకు గాను 8 టేబుల్స్ ఏర్పాటు చేసి 2 రౌండ్లలో పూర్తి చేయడం జరుగుతుందని, క్యాతనపల్లి మున్సిపాలిటీకి సంబంధించి 22 వార్డులకు గాను 22 టేబుల్స్ ఏర్పాటు చేసి రౌండ్ కి 1 వేయి ఓట్ల చొప్పున 2 రౌండ్లలో పూర్తి చేయడం జరుగుతుందని, మంచిర్యాల నగరపాలక సంస్థకు సంబంధించి 60 వార్డులకు గాను 60 టేబుల్స్ ఏర్పాటు చేసి రౌండ్ కి 1 వేయి ఓట్ల చొప్పున లెక్కించడం జరుగుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో సజావుగా సాగేలా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*





