అక్టోబర్ 2
సర్పంచ్ బాలాక్ష్మి ఐలయ్య
జగదేవపూర్: పరిసరాల పరిశుభ్రత లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ స్వచ్ఛత హే సేవ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు అని మునిగడప సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య అన్నారు,దాంట్లో భాగంగానే మండలం లోని మునిగడప గ్రామం లో గ్రామస్తులతో కలిసి పాఠశాల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు రోడ్డు పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలు తొలగింపు మరియు రోడ్లకు ఇరువైపులా ఉన్నటువంటి ప్లాస్టిక్ కాగితాలు, రోడ్ల పక్కన ఉన్నటువంటి చెత్తను ఏరివేసి ఒక గంట శ్రమదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం,మండల బి సి సెల్ అధ్యక్షులు శ్రీశైలం యాదవ్,గ్రామ బి అర్ ఎస్ పార్టీ అధ్యక్షులు అనిల్. గ్రామస్థులు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
