వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పారదర్శకంగా సంక్షేమ పథకాలు
ముఖ్య కార్యకర్తల సమావేశంలో జడ్పీ చైర్మన్ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
ములుగు జిల్లా,వెంకటాపూర్,అక్టోబర్ 01
రానున్న అసెంబ్లీ ఎన్నికలలో వందపైచిలుకు అసెంబ్లీ స్థానాలతో అసెంబ్లీ స్థానాలతో కేసిఆర్ హ్యాట్రిక్ సిఎంగా చరి త్రలో నిలిచిపోవడం ఖాయ మని ములుగు జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి జ్యో స్యం చేప్పారు.వెంకటాపూర్ మండలంలో స్థానిక బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగాల రమణారెడ్డి అధ్యక్షతన ఏర్పా టు చేసిన ముఖ్యకార్తల సమా వేశంలో ఆమె ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకుల మర్రి లక్ష్మణ్ రావుతో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ములుగు నియోజక వర్గంలో ఘన విజయం సాధించడం ఖాయమని సిఏం కేసిఆర్ దేశానికే ఆదర్శమని దేశంలో ఎక్కడ లేని విధంగా అభివృద్ది సంక్షేమం రాష్ట్రంలో ఒక నిరం తర ప్రక్రియ కొనసాగుతుందని అన్నారు.కాంగ్రెస్ బిజేపి పాలిత రాష్ట్రాలలో నేటికి రూ. 600 ల పెన్షన్లు అమలులో ఉన్నాయని అన్నారు.ఎన్నికల వేళ కాంగ్రెస్ బిజేపి నాయకుల వేళ తప్పు డు ప్రచారాలని ప్రజలు నమ్మ వద్దని సూచించారు.రానున్న ఎన్నికల్లో తన గెలుపు కోసం పార్టీ నాయకులు కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని బీఆర్ఎస్ ప్రభు త్వంలో ఉన్న విధంగా పారద ర్శకంగా సంక్షేమ పథకాలు ప్రజలకు గతంలో ఎన్నడు చేరలేదని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ డల బిఆర్ఎస్ ఎన్నికల ఇంచా ర్జీ సాంబారి సమ్మారావు, ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోవింద నాయక్, స్థానిక ఎంపిపి బుర్ర రజిత సమ్మయ్య గౌడ్,జడ్పిటిసి రుద్రమదేవి,అశోక్,కోఆప్షన్ సభ్యులు జగీర్ పాషా,డిసిసిబి డైరెక్టర్ గోపాల్ రావు,పిఏసి ఎస్ చైర్మన్ మాడుగుల రమేష్, రామప్ప పరిరక్షణ సమితి చైర్మన్ రామ్మోహన్ రావు,కృష్ణ ప్రసాద్,మల్క రమేష్,హర్జీ నాయక్,కూరెల్లి రామాచారి, స్థానిక సర్పంచ్ మేడబోయిన అశోక్, పోషాల వీరమల్లు, తండ రమేష్,లక్ష్మీందేవిపేట సర్పంచ్ గట్టు కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.