వర్గల్ మండల్, అక్టోబర్ 1: గజ్వేల్ ముదిరాజ్ సోదర సమాజమా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం లో మీరు నియోజకవర్గస్థాయిలో నాలుగో తారీఖు నాడు మన ముదిరాజుల న్యాయమైన హక్కుల సాధన కోసం నిర్వహించ తలపెట్టిన గజ్వేల్ సింహ గర్జన ర్యాలీ వైపు రాష్ట్ర మొత్తం ఈనాడు గజ్వేల్ వైపు రెండు కండ్ల తో కంటికి కునుకు లేకుండా చూస్తుంది.
మనకు జరిగిన అన్యాయాల పైన మనం చేస్తున్న పోరాటాలను గమనముతో గంభీరంగా గమనిస్తుంది, అందుకే ముదిరాజ్ బిడ్డలారా అవకాశం ఇప్పుడు మన చేతిలోకి వచ్చింది, దీనిని అందిపుచ్చుకొని ఈ ఉద్యమాలను అందరం ఏకమై కలిసికట్టుగా పిడికిలి బిగించి, ఉద్యమ ఫిరంగులను తీవ్రతరం చేస్తే, రాష్ట్రమే మన దగ్గరికి దిగివస్తుంది.
ముఖ్యంగా మేధావులు, ఉద్యోగులు, చదువుకున్న యువతీ యువకులు, జాతి హక్కుల సాధన కోసం జాతికి అండదండగా, వెన్నుదన్నుగా ముందుండి నడిపించాలి.
గజ్వేల్ గర్వించే విధంగా దిక్కులు పిక్కటిల్లే విధంగా ముదిరాజుల రణ నినాదాలతో, వర్గల్ మండల ముదిరాజ్ సోదరులు తరలి రావాల్సిందిగా, ముదిరాజ్ వర్గల్ మండల అధ్యక్షులు శ్రీరాం నర్సింలు, ముదిరాజ్లకు పిలువు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమం లో మండల సర్పంచి పోరం అధ్యకులు ఎల్క్కండి సంతోష, వెంకట్ ముదిరాజ్, బీజేపీ వర్గల్ మండల అధ్యక్షులు శ్రీరాం శ్రీకాంత్ ముదిరాజ్ , మండల ముదిరాజ్ సంగం గ్రామం అధ్యక్షులు మండల ముదిరాజ్ నాయకులు పాల్గొన్నారు