ములుగు జిల్లా,ఏటూరు నాగారం,అక్టోబర్ 01
ఏటూరునాగారంకు చెందిన అనారోగ్య బాధితుడు శివరాపు జనార్దన్ హాస్పిటల్ వెళ్ళటానికి డబ్బులు లేక ఇబంది పడు తున్న విషయం ఏటూరునా గారం బ్లడ్ డోనర్ దృష్టికి రాగ దాతల సహాయంతో 5500 రూపాయలు సమాకూర్చి వారి ఇంటి వద్దకు వెళ్లి అట్టి రూపా యలను ఖలీల్ మెడికల్ షాప్ యజమాని మహమ్మద్ ముజీబ్ ఖాన్ చేతుల మీదుగా అందించటం జరిగింది. సహాయం చేసిన దాతలకు జనార్దన్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో ఏటూ రునాగారం బ్లడ్ డోనార్స్ సయ్యద్ వహీద్,ఎండీ అజారుద్దీన్,దామెర ప్రశాంత్, ప్రమోద్,పాల్గొన్నారు.