బిఆర్ఎస్ లోకి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షులు
ములుగు జిల్లా ,ఏటూరు నాగారం,అక్టోబర్ 01
ఏటూరునాగారం మండలం తాళ్ల గడ్డలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గడదాసు సునిల్ కుమార్ మాజీ ఎంపీపీ కోనేరు నగేష్ అన్నబోయిన రాజు యాదవ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ లోకి కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి 200 మంది చేరగా వారికీ బీఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మీన రసింహారావు (లక్ష్మణ్ బాబు) బిఆర్ఎస్ పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానిం చారు.సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ శుభాకాం క్షలు తెలిపారు.పార్టీలో చేరిన వారందరూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులమై బిఆర్ఎస్ పార్టీ లో చేరామని తెలిపారు.అనం తరం జిల్లా అధ్యక్షులు కాకుల మరి లక్ష్మీనరసింహారావుని శాలువాతో సన్మానించి వారికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల పార్టీ అధ్యక్షుడు కూనూరు మహేష్ గౌడ్,మాజీ ఎంపీపీ కోనేరు నగేష్,రామన్న గూడెం ఎంపిటిసి ఆల్లి సుమ లత,శ్రీనివాస్,చల్పాక ఎంపీ టీసీ కోట నరసింహులు,మాజీ ఎంపిటిసి బేదిక రమేష్, సీనియర్ నాయకులు ఎండి. వలీ బాబా,పోదెం కృష్ణ ప్రసాద్,కాకులమర్రి ప్రదీప్ రావు,తాడూరి రఘు గండేపేల్లి నరసయ్య,పాల్గొన్నారు.