237 Views
ముస్తాబాద్, మోహినికుంట గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘము పోతుగల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు.1.పోతుగల్ ప్యాక్స్ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా 22 మంది లబ్దిదారులుకు కర్షక మిత్ర చెక్కులు 1.కోటి10 లక్షల20.వేలు రూపాయలు చెక్కులు అందించారు. 2,రైతులకు సహకార సంఘం లో ఉన్నటువంటి లోన్స్ యొక్క షేర్ కాపిటల్ పైన 10.శాతం డివిడెండ్ ప్రకటించారు.3, రైతుల సేవ కోసం కామన్ సర్వీస్ సెంటర్ ప్రారంభించారు.4,ఈ కార్యక్రమనికి 16 గ్రామాల నుండి సుమారుగా 500 లకు పైచిలుకు రైతులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మోహినికుంట సర్పంచ్ కల్వకుంట్ల వనజ, రాష్ట్ర మార్కఫైడ్ డైరెక్టర్ బండ నర్సయ్య యాదవ్, ఎంపీపీ జనగామ శరత్ రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, రైతుబందు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్ రావు, ప్యాక్స్ వైస్ ఛైర్మన్ మెరుగు రాజేశం గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, పోతుగల్ సర్పంచ్ మాజీ ప్యాక్స్ చైర్మన్ తన్నీరు గౌతమ్ రావు, సర్పంచ్ ల ఫోరమ్ అధ్యక్షుడు కలకొండ కిషన్ రావు, ప్యాక్స్ డైరెక్టర్లు, మండల బిఅర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు మాజీ ప్రజా ప్రతినిధులు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీ లు, వివిధ గ్రామాల ప్రజా ప్రతినిధులు సంఘ పరిధిలో ఉన్న16 గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.


