సిద్దిపేట జిల్లా వర్గల్ మండల పరిధిలోని నెంటూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మహిళల రక్షణ, షీటీమ్ వివిధ విధులు, ర్యాగింగ్, ఇవిటిజింగ్, పోక్సో, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్, సైబర్ నేరాలు, కొత్త చట్టాలు, సోషల్ మీడియా జాగ్రత్తల గురించిన అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళల భద్రత కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, విద్యార్ధులు చెడు అలవాట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకం తప్పించాలని చెప్పారు. పిల్లలపై వేధింపులైతే వెంటనే డయల్ 100 లేదా సిద్దిపేట షీటీమ్ వాట్సాప్ నెంబర్ 8712667434కి తెలియజేయాలని సూచించారు.





