రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సమ్మె చేస్తున్న ఆశా వర్కర్లకు మద్దతు ప్రకటిస్తూ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి శనివారం మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సేవలు అమూల్యమైనవని కరోనా సమయంలో తల్లి చెల్లి భార్య చేయలేని సేవలు ఆశా కార్యకర్తలు ధైర్య సాహసాలతో చేయడం జరిగిందన్నారు.
తమ కుటుంబాలకు ఏమన్నా అవుతది అని భయం విడనాడి సమాజ సేవకు ముందుకు రావడం జరిగిందన్నారు సుప్రీంకోర్టు నియమ నిబంధనల ప్రకారం ఒక ఉద్యోగికి 18 వేల రూపాయల వేతనాన్ని చెల్లించాలనె. నియమాన్ని ప్రభుత్వం ఉల్లంఘించడం జరుగుతుందన్నారు.
ప్రసూతి సెలవులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు అన్ని జిల్లాలలో ఆశా కార్యకర్తలకు బీడీ. వితంతు ఒంటరి మహిళ పెన్షన్లు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుందన్నారు ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశా వర్కర్లకు పెన్షన్లను తొలగించడం అన్యాయం అన్నారు ప్రభుత్వం వీరితో వెట్టిచాకిరి చేయించుకుంటూ తక్కువ వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు.
సంఘీభావం ప్రకటించిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్జి,ల్లా కార్యదర్శి లింగం గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి,బీసీ సెల్ అధ్యక్షులు అనవేని రవి, ఎస్సీ సెల్ అధ్యక్షులు సుడిద రాజేందర్,మైనార్టీ సెల్ అధ్యక్షులు ఎండి రఫీక్యూ,త్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజు నాయక్, నాయకులు కొత్తపల్లి దేవయ్య,చెన్ని బాబు,గంట బుచ్చ గౌడ్న, నరేందర్, గుల్లపల్లి లక్ష్మారెడ్డి,సిరిపురం మహేందర్ పాల్గొన్నారు.
