వర్గల్ మండల్ నవంబర్ 5 :కాంగ్రెస్ హయాంలోని గ్రామాల అభివృద్ధి.మండల పార్టీ అధ్యక్షులు సందీప్ రెడ్డి
వర్గల్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందిందని వర్గల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఎంపిటిసి సభ్యులు సందీప్ రెడ్డి పేర్కొన్నారు. వర్గల్ మండల కేంద్రంలో ఆదివారం వర్గల్ మండల కేంద్రంలో మీనాజిపేట్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు యూత్ అధ్యక్షులు ఆంక్ష రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 9 ఏళ్ల బిఆర్ఎస్ పాలనలో అనేక హామీలతో మోసపోయారని కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కచ్చితంగా నిలబెట్టుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రజలకు అందించేందుకు సుముఖతంగా ఉందని దానిని కూడా ప్రజలు నమ్ముతున్నారని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మోహన్, మండల పార్టీ యూత్ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, నాయకులు నందు, శ్రీనివాస్ రెడ్డి, నరసింహుల తోడు పాటు తదితరులు పాల్గొన్నారు




