రాజకీయం

కవ్వంపల్లి కి బ్రహ్మరథం పడుతున్న ప్రజానీకం..

326 Views

అందరికి అండగా వుంటా-ఒక్కసారి అవకాశం ఇవ్వండి

– కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి

(తిమ్మాపూర్ నవంబర్ 24)

ఎన్నికల ప్రచారంలో తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం, పొలంపల్లి గ్రామలలో గురువారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రచారనికి వచ్చిన సందర్భంగా గ్రామలలోని ప్రజలు కార్యకర్తలు కోలాటాలతో, డప్పు చప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం కవ్వంపల్లి మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. 1200 తెలంగాణ బిడ్డల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదని అలాగే దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్, బిసిబందు, గృహలక్ష్మి పథకాలను ప్రవేశపెట్టి ఏ ఒక్క పథకాన్ని కూడా పూర్తిస్థాయిలో అమలు చేయకుండా మళ్లీ కొత్త కొత్త పథకాలతో మోసపూరిత మాటలు చెపుతున్న కేసీఆర్ మాటలు నమ్మి మళ్ళీ మోసపోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం
అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలోని ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని అన్నారు. తిమ్మాపూర్ మండలంలోని మొగిలిపాలెం, పొలంపల్లి గ్రామలలో ఎన్నికల ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను ప్రజలకు వివరించి, ముఖ్యంగా ప్రతి మహిళ ఖాతాలో మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు, మహిళలందరికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం,500 కే

వంట గ్యాస్ సిలిండర్ మరియు పింఛను 4000 పెంచుతామని తెలిపారు. రైతు భరోసా కింద 15000 సాయం, రైతు కూలీలకు సంవత్సరానికి 12000, కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యార్థుల లక్షల విద్యా కార్డులు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటరే స్కూల్స్ నిర్మిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలన్నారు.. ఈ నెల 30వ తేదీన జరగబోయే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మానకొండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ప్రజలను కోరారు.

అనంతరం మొగిలిపాలెం, పొలంపల్లి గ్రామాలలో వివిధ పార్టీలకు చెందిన యువకులు, నాయకులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కవ్వంపల్లి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టి నాయకులు, సిపిఐ నాయకులు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

Oplus_131072
Oplus_131072
కొమ్మెర రాజు తిమ్మాపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *