సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని స్థానిక ఎంపీటీసీ, ఎంపిటిసిల పొరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మునిగడప గ్రామంలో ఉన్న పెద్ద చెరువు లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక సర్పంచ్ బాలక్ష్మి ఐలయ్య,మాంధాపూర్ సర్పంచ్ బిక్షపతిలతో కలిసి స్థానిక ఎంపీటీసీ, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షులు కిరణ్ గౌడ్ చెరువులో పూజలు చేసి ఉచిత చేప పిల్లలను వదిలారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లావణ్య మల్లేశం, బిజీ వెంకటపూర్ మాజీ సర్పంచ్ సత్యనారాయణ,మాందాపూర్ మాజీ సర్పంచ్ నర్సింలు,గ్రామ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు స్వామి,గ్రామాల నాయకులు నర్సింలు,రఘుపతి, బాలు,శ్రీను,రవి, పెద్దిరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
