
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం సెప్టెంబర్ 29(TS24/7 తెలుగు న్యూస్):చలో ఇందిరాపార్క్ ఆర్యవైశ్య కార్పొరేషన్ దీక్ష విజయ వంతం చేయాలని సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ యువజన అధ్యక్షులు ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ అన్నారు శుక్రవారం సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలో రావికంటి చంద్రశేఖర్ మాట్లాడుతూ శనివారం తేదీ 30 సెప్టెంబర్ 2023 శనివారం రోజున ఉదయం 10 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు తెలంగాణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరవాది లక్ష్మీనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ధర్నా చౌక్ ఇందిరాపార్క్ వద్ద జరుగనున్న
ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్ష లో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొనాలని అన్నారు సమాజంలో అన్ని రంగాల్లో ఆర్యవైశ్యుల పాత్ర ప్రముఖమైనది కానీ ఆర్థికంగా వెనుకబడిన ఆర్యవైశ్యుల కోసం వెంటనే ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిర్వహిస్తున్న ఆర్యవైశ్య కార్పొరేషన్ సాధన దీక్షకు సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్యులందరూ యువత మహిళా సేవాదళ్ సభ్యులందరూ పాల్గొని సిద్దిపేట జిల్లా ఆర్యవైశ్యుల ఐక్యతను చాటాలని కోరారు




