దళిత ధైర్యం మరియు ప్రతిఘటనకు చిహ్నం భీమ్ రావ్ కోరేగావ్
మంచిర్యాల జిల్లా.
ఐబి చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి నాగుల కిరణ్ బాబు మాట్లాడుతూ భీమ్ రావ్ కోరేగావ్” అనేది జనవరి 1, 1818న జరిగిన చారిత్రాత్మక భీమా కోరేగావ్యుద్ధాన్నిసూచిస్తుంది. ఇక్కడ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలోని దళిత (మహార్) సైనికుల చిన్న దళం చాలా పెద్ద పీష్వా సైన్యాన్ని ఓడించి, దళిత ధైర్యం మరియు ప్రతిఘటనకు చిహ్నంగా మారింది.500 మంది మహర్ లు 28 వేల మంది పీష్వా సైన్యాన్ని మట్టుకరిపించి,
పీష్వా ల నుండి బహుజన బిడ్డలకు విముక్తి లభించింది.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోనల్ కోఆర్డినేటర్ కాదశి రవీందర్, జిల్లా అధ్యక్షులు ముల్కల రాజేంద్రప్రసాద్, దాగం శ్రీనివాస్, మల్లేష్, శంకర్, సందీప్, కిరణ్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.





