రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు స్కిల్స్ పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూఆర్,టాటా స్కై వారి సౌజన్యంతో ప్రతిమ ఫౌండేషన్ వారు పదవ తరగతి,డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 90 రోజులు ఉచిత శిక్షణ తో పాటు,భోజన వసతి కల్పించి అర్హులైన విద్యార్థులకు సర్టిఫికెట్ అందజేయడం జరుగుతుందని తెలిపారు.
ప్రతిమ ఫౌండేషన్ ఆర్గనైజర్ వెంకటలక్ష్మి మాట్లాడుతూ… 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాలలోపు ఉన్న విద్యార్థులకు బ్యాంకింగ్ రంగంలో, నర్సింగ్ రంగంలో, ఏసి టెక్నీషియన్, సోలార్ టెక్నీషియన్, కుట్టు శిక్షణ, వీటన్నిటికీ ఉచితంగా శిక్షణ ఇచ్చి మా ఫౌండేషన్ తరపున ప్లేస్మెంట్ చూపించడం జరుగుతుందని కావున ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శుక్రవారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో విద్యార్థులకు తెలిపారు.
ఈ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డిపేట ఎంపీటీసీ పందిర్ల నాగరాణి హాజరయ్యారు. ఆసక్తిగల విద్యార్థులు 7013882822 కి సంప్రదించవలెను.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




