ఎల్లారెడ్డిపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం* ” *రైతుకు భరోసా* ”
*సింగిల్ విండో చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి*
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్లారెడ్డిపేట యొక్క మహాజన సభ సహకార సంఘ భవన ఆవరణలో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించడం జరిగింది. సభలో చర్చించిన అంశాలు:
అధ్యక్షులు మాట్లాడుతూ తేదీ: 01-04-2023 నుండి 31-08-2023 వరకు గల ఆదాయ,వ్యయ నివేధికలు ప్రవేశపెట్టడం జరిగింది. వాటిని సభ్యులు ఆమోదించడం జరిగింది. ఈ సీజన్ కి సంబంధించిన ఎరువులు, విత్తనాలు సొసైటీ పరిధి గ్రామాల రైతులకు కొరత లేకుండా అందించడం జరిగిందని వారు తెలియజేశారు. సభ్యులకు గల సందేహాలను మరియు వారి విలువైన సూచనలు స్వీకరించారు.తదుపరి సభ్యులకు గల సందేహాలను నివృత్తి చేశారు. సర్వేపల్లి గ్రామంలో నిర్మించిన డీజిల్&పెట్రోల్ బంకు త్వరలో పునః ప్రారంభించబోతున్నామని ఈ సందర్భంగా చైర్మన్ గారు తెలియజేశారు. ఎల్లారెడ్డిపేట సహకార సంఘంనకు టేస్కాబ్ ఛైర్మెన్ శ్రీ కొండూరి రవీందర్ రావు గారి సహకారంతో పెద్ద ఎత్తున దీర్ఘకాలిక రుణాలు మరియు స్వల్పకాలిక రుణాలు మంజూరుచేశామని, అదేవిదంగా ఇట్టి సమావేశం లో సభ్యులందరి సమక్షం లో మోడల్ బైలా, అడిట్ నివేదిక, 6% డివిడెంట్ లకు ఆమోదించడం జరిగింది. అలాగే దీర్ఘకాలిక, స్వల్పకాలిక రుణాలు తీసుకున్న రైతులు అకస్మాత్తుగా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలకు 10000/- రూపాయలు ”రైతు భరోసా” క్రింద ఇవ్వడానికి ఆమోదం తెలిపారు. ఎల్లారెడ్డిపేట సహకార సంఘం ”A” కేటగిరిలో రావడం చాలా సంతోషం దీనికి సహకరించిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంఘ వైస్ చైర్మన్ జంగిటి సత్తయ్య, డైరెక్టర్లు వెంకట నరసింహారెడ్డి, దొమ్మాటి నర్సయ్య, గోగూరి ప్రభాకర్ రెడ్డి, కస్తూరి రామచంద్రారెడ్డి, కనకట్ల సుధాకర్, కోనేటి ఎల్లయ్య, ల్యాగల సతీష్ లతో బాటుగా ఎగదండి శ్రీనివాస్ లంబ సత్తయ్య మరియు రైతులు పాల్గొన్నారు.
