ప్రాంతీయం

పంచాయతీ కార్మికులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు…

166 Views
      ముస్తాబాద్, జూలై16, మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ సమీపంలో కార్మికుల నిరసన దీక్ష చేస్తుండగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గజ్జల రాజు మద్దతు తెలిపారు. గజ్జెలరాజు మాట్లాడుతూ ఒకవైపు గ్రామపంచాయతీ కార్మికులు సామరస్యంగా దీక్ష చేస్తావుంటే ఈదీక్షను కుట్రపూరితంగా అధికారులు భగ్నం చేయాలని చూడగా వారితో రోడ్డుపై ట్రాక్టర్ కు ఎదురుగా కూర్చుని నిరసన తెలియజేస్తున్నాంమన్నారు.11రోజుల నుండి గ్రామపంచాయతీ కార్మికులు దీక్షలు చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి కేటీఆర్ స్పందించకపోవడం ఇచ్చినమాట నిలబెట్టుకోకపోవడం కార్మికుల కోరికలను డిమాండ్లను నెరవేర్చకపోవడం చోచనీయమన్నారు. ఒకవైపు వర్షాలు ప్రారంభమై సీజనల్ వ్యాధుల వాపించడం ద్వారా ప్రజలు అనారోగ్యం పాలై  ఆసుపత్రుల పాలవుతుంటే ముస్తాబాద్ మండల ప్రజాప్రతినిధులు ఏంచేస్తున్నారని నేను అడుగుతున్నా ప్రజల ఆరోగ్యాన్ని వ్యాధుల నివారణను మరిచి రోడ్లపై ధర్నాలు రాస్తారోకోలు కార్మికులు చేస్తూంటే ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. ఓట్లువేసిన ప్రజలను మర్చిపోయి అధికారంలో ఉండి నాయకులు ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను  నెరవేర్చి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరారు. గడిచిన10. పది రోజుల నుండి దీక్షచేస్తే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని అన్నారు. ఈకార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జలరాజు, ఆరుట్ల మహేష్ రెడ్డి, తాళ్ల విజయ్, గ్రామపంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *